Warning: Declaration of TCB_Menu_Walker::walk($elements, $max_depth) should be compatible with Walker::walk($elements, $max_depth, ...$args) in /home/telugugo/public_html/wp-content/plugins/thrive-visual-editor/inc/classes/class-tcb-menu-walker.php on line 0
అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళ హత్యపై ఇంకా వీడని మిస్టరీ – Telugu Gossip
  • Home  / 
  • క్రైం న్యూస్
  •  /  అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళ హత్యపై ఇంకా వీడని మిస్టరీ

అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళ హత్యపై ఇంకా వీడని మిస్టరీ

సుంకర చంద్రశేఖర్‌ sunkara chandrasekhar

అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళు హత్యపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది ..హత్యకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగుతోంది .. ఈ హత్యలు ఎందుకు ..దేనికోసం.. అన్న దానిపైన క్లారిటీ కి పోలీసులు రాలేకపోతున్నారు ..అసలు చంద్రశేఖర్  హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 అమెరికాలోని అయోవా రాష్ట్రం వెస్ట్‌ డెఎస్‌మొయిన్స్‌లో కడతేరిన సుంకర చంద్రశేఖర్‌ (45) కుటుంబం నేపథ్యం! భార్యాపిల్లలను కాల్చి చంపి… తానూ మరణించిన చంద్రశేఖర్‌ (45) స్వస్థలం గుంటూరు నగరం. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తకోటకు చెందిన లావణ్య (41)తో 2003లో ఆయనకు వివాహమైంది. ఆ తర్వాత రెండేళ్లకే వీరు అమెరికాకు వెళ్లిపోయారు. ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ పూర్తి చేసిన లావణ్య అక్కడ నాసాలో కొంతకాలం పని చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. చంద్రశేఖర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 15, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.చంద్రశేఖర్‌, లావణ్య దంపతులు ఈ ఏడాది మార్చిలో వెస్ట్‌డె్‌సమెయిన్స్‌లో ఒక ఇల్లు కొన్నారు. లావణ్య చెల్లెలు కూడా అమెరికాలోనే ఉంటోంది.  అమెరికా కాలమానం ప్రకారం శనివారం గృహ ప్రవేశం జరిగింది. చంద్రశేఖర్‌ తొలుత కింద బాల్కనీ వద్ద భార్య లావణ్యను కాల్చిచంపారు. ఈ శబ్దం విన్న లావణ్య తండ్రి సీతారామిరెడ్డి తన గది నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న అల్లుడు చంద్రశేఖర్‌ను ప్రశ్నించగా… ‘‘ఏమీ లేదు మీరు వెళ్లి పడుకోండి! పిల్లలు పడుకున్నారో లేదో చూస్తున్నాను’’ అని బదులిస్తూ, పిల్లలున్న గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా శబ్దాలు రావడంతో సీతారామిరెడ్డి పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లి చూశారు. చంద్రశేఖర్‌, ఆయన ఇద్దరు కుమారులు రక్తపు మడుగులో విగతజీవులై కనిపించారు. బాల్కనీలో లావణ్య మృతదేహం కనిపించింది. 
తీవ్ర మానసిక ఒత్తిడిలోనే సుంకర చంద్రశేఖర్‌ తన భార్యా పిల్లలను కాల్చిచంపి… తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడికి ఆరోగ్యం బాగలేదని, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయంకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారని సమాచారం. మరోవైపు… వెస్ట్‌ డెస్‌మెయిన్స్‌లో ఇల్లు కొన్నప్పటి నుంచి పరిస్థితులు అనుకూలించడం లేదన్న దిగులు చంద్రశేఖర్‌ను వెంటాడినట్లు చెబుతున్నారు. 
కొడుకు మానసిక స్థితితో పాటు తాను కొనుగోలు చేసిన ఇల్లు రాలేదన్న కోపం తోటే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా ఎన్ని ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి బాగా దిగజారినట్లు చంద్రశేఖర తన వర్గాలకు చెప్పినట్లుగా సమాచారం

Related Posts
No related posts for this content
About the author

sreehari